స్విమ్మింగ్ రాష్ట్ర స్థాయి పోటీలో మూడో స్థానంలో నిలిచిన శ్లోకాస్ శ్రీవాణి విద్యార్థి

రాష్ట్ర
Headlines

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణానికి చెందిన శ్లోకాస్ శ్రీవాణి హై స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి మహమ్మద్ అబ్దుర్ రహిమాన్ సిద్ధిఖ్ హైదరాబాదులో నిర్వహించిన 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఈతల పోటీలో మూడో స్థానంలో నిలువగా.. అదన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అభినందించారు. ఇలాంటి పోటీల్లో రాష్ట్ర, దేశ స్థాయిలో మరింత ప్రతిభ కనబరిచి మంచి పేరు తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎండి.జావిద్ ఆలీ 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఈతల పోటీలో మూడో స్థానంలో నిలిచిన మహమ్మద్ అబ్దుర్ రెహమాన్ సిద్ధిఖ్ గెలవడం జిల్లాకు గర్వకారణమని, ఇప్పటి వరకు స్విమ్మింగ్ లో సంగారెడ్డి జిల్లా నుండి ఏ ఒక్కరు కూడా పోటీలో నెగ్గలేదని అన్నారు. రానున్న రోజుల్లో మహమ్మద్ అబ్దుర్ రెహమాన్ రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో మరింత కృషి చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నామని తెలిపారు. అందుకు విద్యార్థిని అభినందిస్తూ టీఎన్జీవోస్ పక్షాన అదనపు కలెక్టర్ చేతుల మీదుగా నగదు పురస్కారం అందజేశారు. విద్యార్థులకు మానసిక ఓత్తిడిని అధిగమించడానికి క్రీడలు అత్యంత అవసరమని, క్రీడల్లో ముందుకు రాణించేందుకు పాఠశాల తరపున విద్యార్థులకు పూర్తి మద్దతు ఉంటుందని ప్రిన్సిపాల్ హసన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఓ పద్మజ, డివైస్ ఓ ఖాసిం బేగ్, టీఎన్జీఎస్ కార్యదర్శి బి.రవి, అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now