ఆకస్మిక తనిఖీ చేసిన నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

ఆకస్మిక
Headlines :
  • నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి పై ఆందోళన
  • కోటగల్లీ గర్ల్స్ హై స్కూల్ లో ఆకస్మిక తనిఖీ
  • విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యం
  • మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపాలు
  • రాష్ట్ర ప్రభుత్వానికి పెండింగ్ బిల్స్ చెల్లించాలని డిమాండ్

నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 04:

నిజామాబాద్ లో కోటగల్లి ప్రభుత్వ బాలికల హై స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు ప్రభుత్వాలు మారుతున్నా ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మారడం లేదని అన్నారు నిజామాబాదు అర్బన్ లో కోటగల్లీ గర్ల్స్ హై స్కూల్ అంటే ఒకప్పుడు మంచి పేరుందని కానీ ఇప్పుడు పాఠశాలలో కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి అని అన్నారు..

ప్రభుత్వ పాఠశాలలు అంటే సమస్యలకు నిలయంగా మారాయి, విద్యార్థుల తరగతి గదులలో కనీసం లైట్స్ కూడా లేవని విద్యార్థులు చీకటిలో విద్యను అభ్యశించాల్సిన పరిస్థితి ఉందన్నారు, తరగతి గోడలు ఎప్పుడు కూలిపోతాయో అనే భయంలో విద్యార్థులు ఉన్నారని అన్నారు, దాదాపు ఏడువందల సంఖ్య ఉన్న పాఠశాలలో కేవలం ఆరు టాయిలెట్స్ ఉండటం దారుణం అన్నారు, తరగతి గదులకు కిటికీలు సరిగా లేనందున కోతుల బెడదా ఉన్నట్లు విద్యార్థులు తెలిపారన్నారు

గతంలో స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఒక విద్యార్థిని చనిపోయిందని, ప్రస్తుతం కూడా కరెంటు వైర్లు వేలాడటం పై అధికారులపై మండిపడ్డారు వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది.తరగతి టీచర్స్ ఇష్టరాజ్యాంగ సెలవులు తీసుకోవడం, తరగతి గదుల్లో లేకపోవడం పిల్లల హాజరు పట్టిక రెండు రోజుల నుండి హాజరు వేయకపోవడం పై మండిపడ్డారు.

మధ్యాహ్న భోజనం మేను ప్రకారం పెట్టడం లేదని సోమవారం విద్యార్థులకు గుడ్డు, సాంబర్ పెట్టాల్సింది పెట్టకుండా అడిగితె మెస్ బిల్లులు రావడం లేదనడం పై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. జిల్లా విద్యాధికారి ఏసీ రూమ్ కి పరిమితం కాకుండా జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

గత ప్రభుత్వం మన ఊరు మన బడి అని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలు అని ఇంటర్నేషనల్ స్కూల్ విద్యావిధానం అందిస్తాం అని గొప్పలు పలికి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది అన్నారు కేంద్ర ప్రభుత్వం మిడ్డే మిల్స్ కింద ఒకటో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు బిల్స్ చెల్లీస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది, పదోతరగతి విద్యార్థులకు కూడా బిల్స్ చెల్లించలేక బకాయిలతో కాంట్రాక్టర్లు నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించలేక పోతున్నారని వాపోయారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న మిడ్డే మిల్స్ బిల్స్ చెల్లించాలని డిమాండ్ చేసారు.
అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో MEO సాయ రెడ్డి, ఉపాధ్యాయులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు మఠం పవన్, మరవర్ కృష్ణ, బాబీసింగ్, పల్నాటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now