Headlines
-
నిజామాబాద్‌లో అర్ధరాత్రి వ్యాపారాలపై పోలీసుల కొరడా, 11 హోటళ్లపై కేసులు
-
నిజామాబాద్‌లో అర్ధరాత్రి వ్యాపారాలు: పోలీసులు కట్టడి చర్యలు, 11 హోటళ్లపై కేసులు
-
రాత్రి వ్యాపారాలు నడుపుతున్న వారిపై నిజామాబాద్ పోలీసుల చర్య
-
నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తటస్థం: అర్ధరాత్రి వ్యాపారాలు కొనసాగించిన 11 హోటళ్లపై కేసులు
-
మద్యం అమ్మకాలు, హోటళ్లు: నిజామాబాద్‌లో అర్ధరాత్రి వ్యాపారాలపై పోలీసులు కట్టడి
నిజామాబాద్ నగరంలో అర్ధరాత్రి పూట వ్యాపారాలు నిర్వహిస్తున్న యజమానులపై పోలీసులు కొరడా ఝలిపించారు. 11 హోటళ్లపై కేసులు నమోదు చేశారు. ఇందులో పలు టీకొట్లు, బిర్యానీ హోటళ్లు, పాన్ షాప్‌లు ఉన్నట్లు సమాచారం. శనివారం అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మఫ్టీలో తిరిగి కేసులు నమోదు చేయించడంతో పాటు హెచ్చరికలు జారీ చేశారు.నిజామాబాద్ నగరంలో అన్ని వ్యాపార సంస్థలు రాత్రి 11 గంటల్లోపు మూసివేయాలని నిబంధనలు అమలులో ఉన్నాయి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారాలు నిర్వహిస్తే సిటీ పోలీస్ యాక్ట్ కింద చర్యలు చేపడుతున్నారు. అయితే రైల్వేస్టేషన్, బస్టాండ్, బోధన్ రోడ్డు, నెహ్రూ పార్క్, ఖిల్లా రోడ్డు ప్రాంతాల్లో నడుస్తున్న పలు హోటళ్లు, టీ కొట్లు, పాన్ షాప్‌ల నిర్వాహకులు అర్ధరాత్రి దాటినా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో యువకులు అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతుండడంతో గొడవలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. దీంతో ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అర్ధరాత్రి పూట సాగుతున్న వ్యాపారాలను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
మద్యం అమ్మకాలు సైతం..
నగరంలో అర్ధరాత్రి తర్వాత కూడా పలుచోట్ల మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా బార్లలో అమ్మకాలు జరుపుతున్నారు. అలాగే నగంలో పలుచోట్ల బెల్ట్ షాపుల్లో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచి విక్రయిస్తున్నారు. వీటిపై కూడా నిఘా పెట్టి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
నిర్ణీత సమయంలో షాపులు మూసేయాలి
– రాజా వెంకట్ రెడ్డి, ఏసీపీ నిజామాబాద్
అర్ధరాత్రి పూట వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. ఎవరైనా నిర్ణీత సమయానికి మించి షాపులు నడిపితే కేసులు నమోదు చేస్తాం. ఒకటి, రెండు, ఆరో టౌన్ పరిధిలో అర్ధరాత్రి తర్వాత తెరిచిన పలు షాపులపై కేసులు నమోదు చేశాం.