నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నెలవారి రివ్యూ మీటింగ్

పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించండి: కమిషనర్ పి. సాయి చైతన్య

నిజామాబాద్ సెప్టెంబర్ 18
(ప్రశ్న ఆయుధం)

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్. రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిన పలు ముఖ్యాంశాలపై అధికారులను సుదీర్ఘంగా దిశానిర్దేశం చేశారు.

“పెండింగ్ కేసులు త్వరగా క్లియర్ చేయాలి. గ్రేవ్, పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తుతో త్వరితగతిన ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలి” అని అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారులతో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి:

🔸 వినాయక చవితి, మిలాద్ పండుగల ప్రశాంత నిర్వహణపై అభినందనలు
🔸 ఉత్తమ విధినిర్వహనానికి సిబ్బందికి ప్రశంసా పత్రాలు
🔸 దేవినవరాత్రులు, దీపావళి ఉత్సవాల కోసం ముందస్తు ఏర్పాట్లు
🔸 దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి
🔸 సి.సి.టీ.ఎన్.ఎస్., స్టేషన్ మేనేజ్‌మెంట్‌పై అధికారులకు అవగాహన
🔸 సైబర్ నేరాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు,
బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రమాద ప్రాంతాల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని, హైవే లింక్ రోడ్ల వద్ద స్పీడ్ కర్స్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రంకన్ డ్రైవింగ్, మైనర్ల వాహన నడపడం వంటి అంశాలపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించాలని ఆదేశించారు.

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు
గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణ, జూదం, పీడీఎస్ బియ్యం దుర్వినియోగంపై ప్రత్యేక దృష్టితో కేసులు నమోదు చేయాలని, రిపీట్‌ నేరస్తులపై పీడి యాక్ట్ అమలు చేయాలని స్పష్టం చేశారు.

గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత:
గ్రామ పోలీసు అధికారులు ప్రతిరోజూ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకం కావాలని, కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, జె. వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీశైలం, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ సతీష్, ఇతర సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now