లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్
Headlines:
  1. “సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ: 84 మందికి రూ. 25.65 లక్షల సాయం”
  2. “సామాన్యులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సీఎం సహాయ నిధి మార్పు అవసరం”
  3. “నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం: సీఎంఆర్ఎఫ్ దిశగా ఎమ్మెల్యే కృషి”
  4. “సీఎంఆర్ఎఫ్ సాయం 50% పెంపు కోసం అసెంబ్లీలో డిమాండ్”
  5. “అనారోగ్య బాధితుల కోసం నిధుల పంపిణీలో పటిష్ట చర్యలు”

 

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నీది ధ్వర 84 మందికి 25,65,000 రూపాల విలువ గల చెక్కులు అందించడం జరిగిందని అన్నారు. ఇప్పటివరకు ఎక్కువ మొత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అర్బన్ నియోజకవర్గనికి రావడం జరిగిందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్న మొత్తంలో 15% లేదా 20% మాత్రమే చెల్లిస్తుందని లక్షల్లో ఖర్చు ఉంటే కేవలం 15వేలు, 20వేలు ఇస్తే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్ధిక భారంగా మారుతుందని అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తంలో 50% ప్రభుత్వం చెల్లించేలే డిమాండ్ చేస్తానని తెలియజేసారు..

గత ఎమ్మెల్యే హయాంలో సంవత్సరాలు గడిసిన చెక్కులు రాలేదని ఇప్పుడు అప్లై చేసుకున్న 3 నెలలో చెక్కులు వచ్చేలా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని లబ్ధిదారులు అందరూ కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment