భరోసా ఏదీ!!రైతుకు…

రైతుకు భరోసా ఏదీ!!*

ఇంకా నిర్ణయం తీసుకోని ప్రభుత్వం

వానాకాలం సీజన్‌కు అందని పెట్టుబడి సాయం

ఇప్పటికీ రూపొందని మార్గదర్శకాలు..

IMG 20240911 WA0014

నల్లగొండ: గత ప్రభుత్వ హయాంలో కొనసాగిన రైతుబంధును కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తుందా? లేదా అనే ది సందిగ్ధంలో పడింది. గుట్టలకు, చెట్లకు, పుట్టలకు, రోడ్ల కు, ఇటుక బట్టీల స్థలాలకు, వెంచర్లకు రైతుబంధు పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబ్బును వృథా చేసిందని గతంలో కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక గత పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు రైతుబంధును పూర్తిస్థాయిలో అమలు చేసింది. రైతుబంధు లో మార్పులు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం యత్నించినా దీనిపై నేటికీ ఎలాంటి ప్రకటన లేదు. ఫలితంగా రైతుబంధు అమలులో అనుమానాలు నెలకొన్నాయి.రైతుబంధును ప్రభుత్వం రైతుభరోసా పేరుతో ఉమ్మడి జిల్లాల స్థాయిలో రైతుల అభిప్రాయాలు తీసుకుంది. ప్రస్తుతం ఆ ఫైల్‌ను ప్రభుత్వం ఆటకెక్కించింది. అభిప్రాయాలను తీసుకున్న తరువాత అసెంబ్లీలో చర్చ పెట్టి అమలు చేస్తామని చెప్పినా, తీరా అసెంబ్లీలో చర్చను సైతం పక్కన పెట్టింది. ఇంతలో రుణమాఫీపై దృష్టిసారించి ప్రభుత్వం రైతుభరోసాను పట్టించుకోకపోవడంతో రైతులకు పెట్టుబడి సాయం అందకుం డా పోయింది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వంపై విమర్శ లు వెల్లువెత్తాయి. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండానే ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని ప్రతిపక్షాలు విమర్శించా యి. ఈ నేపథ్యంలో రైతుభరోసా అమలు చేసే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండగా, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం అధికారుల నుంచి నివేదికలు తీసుకొని రైతులకు భరోసా కల్పించకపోవడం ఎంత వరకు సమంజసమని పలు రైతు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 11లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. అందులో నల్లగొండ జిల్లాలో 5.50లక్షల మం ది, సూర్యాపేట జిల్లాలో 3.50లక్షల మంది, యాదాద్రి జిల్లాలో 2.10లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. సాగు భూమి 21 లక్షల ఎకరాల వరకు ఉంది. ప్రభుత్వం వ్యవసాయ పెట్టుబడులకు రైతులకు భరోసా కల్పించకపోవడంతో వారు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వానకాలం సీజన్‌ ముగియవస్తున్నా, నేటికీ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించలేకపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఎంత భూమి ఉన్నా ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుబంధు ఇచ్చింది. కాంగ్రెస్‌ ప్రభు త్వం ఎన్నికలకు ముందు ఎకరానికి రూ.7500 చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావొస్తున్నా దీనిపై అతీగతి లేదు. రైతుభరోసా అమలుకు ముందుకు వెళ్లాలంటే ఎన్ని ఎకరాలు ఇవ్వాలనే దానిపై కటాఫ్‌ ప్రకటించాల్సి ఉంది. అప్పటి ప్రభుత్వం భూమి ఎంత ఉన్నా ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఎంత వరకు తగ్గించాలి? ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది తేల్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం డైలమాలో ఉన్నట్టు సమాచారం.అభిప్రాయాలు ఓ వైపు… నిధుల భారం మరో వైపుకాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల నుంచి సేకరిస్తున్న అభిప్రాయాల్లో జిల్లాకు ఒకలా భిన్నంగా ఉన్నాయి. కొంతమంది 10ఎకరాల వరకు రైతుభరోసా కల్పించాలని, మరికొంత మంది 15ఎకరాల వరకు, ఇంకొందరు 5ఎకరాల వరకు ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే భూమి ఎంత ఉన్నా గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఇవ్వాలనే డిమాండ్‌ కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా కాకుండా తక్కువ భూమికి రైతుభరోసా ఇస్తే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రహించింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 11 సార్లు రైతుబంధును అమలు చేసింది. అప్పట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు దాదాపు ప్రతీ సీజన్‌లో రూ.1,450కోట్లకు పైగా రైతుబంధు వచ్చేది. ప్రస్తుతం 11లక్షల మందికి పైగా రైతులకు గతంలో మాదిరిగా అమలు చేస్తే ఎకరాకు రూ.7500 చొప్పున ఏటా రెండు సీజన్లలో రూ.15వేలు చెల్లిస్తే ప్రభుత్వంపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో తక్కువ భూమికే రైతుభరోసా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? లేక 10ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతుభరోసా ఇస్తుందా? అనేది వేచిచూడాల్సిందే. కటాఫ్‌పై నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఏ జిల్లాకు ఎంత నిధులు సమకూర్చాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆర్థికశాఖ కూడా కసరత్తు చేయాలి. ఈ నేపథ్యంలో రైతుభరోసాపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేక నాన్చుడు ధోరణిని అవలంభిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.యాసంగికైనా అందేనా?వానాకాలం సీజన్‌ ముగుస్తున్నా రైతుభరోసాపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం వచ్చే యాసంగి నాటికై నా వానాకాలంతో పాటు యాసంగికి రెండు సీజన్లకు కలిపి పెట్టుబడి సాయం అందిస్తారా? లేదా అనే దానిపై తేల్చాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వ నిర్ణయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత వానాకాలంలో వర్షాలు ఆలస్యంగా కురవడం తో ఇప్పుడిప్పుడే మెట్టపంటల్లో ప్రధానమైన పత్తి చేలు జీవం పోసుకున్నాయి. ఈ నేపథ్యంలో పత్తి చేలతో పాటు వరి సాగు కు రైతులకు పెట్టుబడుల అవసరం పెరిగింది. చేతిలో డబ్బు లేక రైతులు అప్పులు చేస్తున్నారు. ఎకరానికి రైతులు రూ.25వేల చొప్పున పెట్టుబడులు పెట్టారు. ప్రైవేట్‌ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి డబ్బు తెచ్చిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతు భరోసాను కాంగ్రెస్‌ ప్రభుత్వం అదనంగా ఎకరాకు రూ.2,500 అంటే మొత్తం రూ.7,500 ఇస్తామని ప్రకటించడంతో ఎంతో ఆశపడిన రైతులు ప్రభుత్వ నిర్ణ యం ప్రకటించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. అసలు ఈ రెండు సీజన్లలో రైతుభరోసాపై నిర్ణయం జరుగుతుందా? లేక వాయిదా వేస్తారా? అనే అనుమానాలు రైతుల్లో ఉన్నాయి. వాస్తవానికి అయితే ఈ వానాకాలం లో జూన్‌ నెలాఖరులో రైతుభరోసా రావల్సి ఉంది. అయితే రెండు నెలలుపైగా గడిచినా నేటికీ నిర్ణయం తీసుకోలేదు.మార్గదర్శకాలు వచ్చిన వెంటనే అమలు : పి.శ్రవణ్‌కుమార్‌, నల్లగొండ, జేడీఏ రైతుభరోసాపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు. విధివిధానాలు రూపొందించి విడుదల చేసిన అనంతరం రైతాంగానికి పెట్టుబడి సాయం అందుతుంది. రైతుభరోసాపై ప్రభుత్వం రైతుల నుంచి అభిప్రాయాలు కూడా సేకరించింది. వీటిన్నంటిని పరిగణనలోకి తీసుకొని రైతుభరోసాను అమలు చేస్తుంది. ఎకరాకు రూ.7,500 ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా త్వరలో ఉత్తర్వులు రానున్నాయి.

Join WhatsApp

Join Now