Site icon PRASHNA AYUDHAM

ఇకపై గ్రామ సర్పంచుల తోనే ఉపాధి నిధుల చెల్లింపులు..రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆదేశం

IMG 20250517 WA2099

*ఇకపై గ్రామ సర్పంచుల తోనే ఉపాధి నిధుల చెల్లింపులు..రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆదేశం*

రాష్ట్రంలో ఉపాధి నిధులను గ్రామ సర్పంచుల ఆధ్వర్యాన చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక వికేంద్రీకరణ విభాగం డైరెక్టర్ రామ్ ప్రతాప్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ఎపి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల కోసం మెటీరియల్ సప్లైదారులకు చెల్లించే నిధులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపిడిఒ) ద్వారా చెల్లించే విధానం 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ విధానం సరికాదని కేంద్ర మంత్రిత్వశాఖ పేర్కొంది.

Exit mobile version