*అక్రమ నిర్మాణం షెడ్డు*..?
*(ప్రశ్న ఆయుధం),జనవరి,06, శేరిలింగంపల్లి,ప్రతినిది*
*నన్ను ఎవరు ఏమి చెయ్యలేరు అంటున్న నిర్మాణదారుడు*..?
*GHMC సెక్షన్ అధికారి సహకారంతో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ షెడ్డు నిర్మాణం*..?
*చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీనగర్ లోని ROAD NO 2*..!
RTC కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు 400 గజములలో భారీ షెడ్డు నిర్మాణం చేస్తున్నారు ఇట్టి అక్రమ నిర్మాణం పైన స్థానికులు భారీ ఎత్తున ఫిర్యాదులు చేసిన గాని జిహెచ్ఎంసి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నారు ఓ సెక్షన్ అధికారి అయితే ఫిర్యాదుదారులను బెదిరించడం గమనార్వం ఇట్టి షెడ్డు నిర్మాణం చేస్తున్న నిర్మాణదారుడు గతంలో కూడా ఇలాగే ఏలాంటి అనుమతులు లేకుండా ఇదే దీప్తి శ్రీనగర్లో రెండు షెడ్లు నిర్మించి వ్యాపారం చేస్తున్నాడు అతనికి ఇలాంటి వ్యవహారాలు అలవాటు అయినాయి కాబట్టి జిహెచ్ఎంసి అధికారులను లొంగదీసుకుని అనుమతులు లేకుండా షెడ్డు నిర్మాణం చేస్తున్నాడు ఇట్టి నిర్మాణం వలన ప్రజలకు ప్రభుత్వానికి ఎంతో నష్టం చేకూరుతుంది జిహెచ్ఎంసి నిధులకు భారీ ఎత్తున గండి పడుతుంది కావున వెంటనే సంబంధిత అధికారులు అయినటువంటి డిప్యూటీ కమిషనర్ ఏసిపి పరిశీలించి ఇట్టి అక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకుంటూ ప్రజల ఫిర్యాదులను పట్టించుకోని సెక్షన్ అధికారి పైన కూడా చర్యలు తీసుకోవాలని నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తున్న మీ మిద్దెల మల్లారెడ్డి