ఆత్మహత్యలు వద్దు – ఆత్మస్థైర్యం ముద్దు’అవగాహన కార్యక్రమం

‘ఆత్మహత్యలు వద్దు – ఆత్మస్థైర్యం ముద్దు’అవగాహన కార్యక్రమం

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ నవంబర్ 17:

 

ఆత్మహత్యలు వద్దు–ఆత్మస్థైర్యం ముద్దు పేరుతో సోమవారం జిల్లాలోని తాడ్వాయి చౌరస్తాలో మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, యువత పెడదారి, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ M. రాజేష్ చంద్ర IPS ఆదేశాల మేరకు, తాడ్వాయి సబ్‌ఇన్స్పెక్టర్ Y. నరేష్ పర్యవేక్షణలో జిల్లా పోలీస్ కళాబృందం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.

 

సైబర్ నేరాల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర సమయంలో DAIL 100, సైబర్ నేరాలకు 1930, షీ టీమ్స్‌కు 8712686094 నంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు.

 

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, గంజాయి–డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల సేవనాన్ని పూర్తిగా నివారించాలని హెచ్చరించారు. మహిళలు, చిన్నపిల్లలపై నేరాలు, బాల్యవివాహాలు, లైంగిక నేరాలపై భరోస టీమ్ అవగాహన కల్పించింది.

 

సెల్‌ఫోన్లు, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలను జాగ్రత్తగా వినియోగించాలని చెప్పింది. పోలీస్ కళాబృంద ఇంచార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, U. శేషరావు, PC సాయిలు పాటలు–మాటల ద్వారా సందేశాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

ఈ కార్యక్రమంలో ASI M. కొండల్ రెడ్డి, మాజీ సర్పంచ్ బండారి సంజీవ్, బ్లూ కోట్స్ PCs సురేష్, దేవి, చందు, HG వసంత్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now