20 కి.మీ వరకూ నో టోల్ గేట్ ఛార్జ్???
మీ వాహనాల్లో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ పెట్టుకుంటే చాలు జాతీయ రహదారులపై 20 కి.మీ. వరకూ ఎలాంటి టోల్ ఛార్జీ లేకుండా ఉచితంగా వెళ్లొచ్చు. 20 కి.మీ దాటాక ప్రయాణించిన దూరానికే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాహనదారులు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమర్చుకోవాల్సి ఉంటుంది. టోల్ రోడ్డుపై వాహనం ఎంత దూరంప్రయాణించిందో ఆన్ బోర్డ్ యూనిట్ల ద్వారా కోఆర్డినేట్లు రికార్డు అవుతాయి. దీంతో టోల్ ఛార్జీ నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది.