సంచార జాతుల కళా ప్రదర్శనలు విజయవంతం చేయాలి — డాక్టర్ నరేష్ బాబు
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 25
సంచార జాతుల కళా ప్రదర్శనలు విజయవంతం చేయాలని సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరేష్ బాబు అన్నారు శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో డాక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ విముక్త సంచార జాతుల అభివృద్ధి మండలి సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో సంస్కృతి విలువలను అందించే సంచార జాతుల కళా ప్రదర్శనలు గజ్వేల్ సరస్వతి శివ మందిర్ లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించే సంచార జాతుల కళా ప్రదర్శనలు విజయవంతం చేయాలని కోరారు, వివిధ వర్గాలకు ఆశ్రిత కులాలకు కుల చరిత్రలు చెప్పే జీవనం గడిపే విముక్త సంచార జాతులు, సంచార జాతుల కలలు సమాజ చైతన్యానికి ఉపయోగపడ్డాయని, వాటిని ముందు తరాల వారికి తెలిపే విధంగా ఒక గొప్ప కార్యక్రమం గజ్వేల్ లో నిర్వహించడం జరుగుతుందని గజ్వేల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యార్థులు యువత అలాగే సీనియర్ సిటిజన్స్, కుటుంబ సమేతంగా హాజరై ఈ సంచార జాతుల కళా ప్రదర్శన తిలకించాలని కోరారు, సంచార జాతుల జీవన విధానంపై ఒక పుస్తకం పాఠకులకు అందించాలన్నదే మా ఆలోచన అని అన్నారు