ఆగని సమ్మె…సాగని చదువులు – మానవ హక్కులను హరిస్తున్న ప్రభుత్వం..!

ఆగని సమ్మె సాగని చదువులు

– మానవ హక్కులను హరిస్తున్న ప్రభుత్వం

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 27 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ కేజీబీవీ, ప్రత్యేక అవసరాలు గత 30 రోజుల తాము సమ్మె చేస్తున్నందున అప్పట్నుండి విద్యార్థులకు విద్యా బోధన అందడం లేదని, ఇది మానవ హక్కులను ఉల్లంఘించడం అవుతుందన్నారు. దానికి ప్రభుత్వమే జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఇచ్చిన హామీని అమలు చేయాలని వెంటనే తమను రెగ్యులర్ చేయాలని అప్పటివరకు పే స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగత కల్పించాలని డిమాండ్ చేశారు. తామంతా మెరిట్ కం రోస్టర్, ఇంటర్వ్యూ, రాత పరీక్ష ద్వారా నియామకమై 18 సంవత్సరాల నుంచి విద్యాశాఖలలో పనిచేస్తున్నా కనీస వేతనాలు లేవని, తాము శ్రమ దోపిడి గురి అవుతున్నామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ టీచర్లు తమకు కావాలని చెప్తున్న ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పురుష ఉపాధ్యాలను పంపించడం ఇది చట్ట విరుద్ధమని ప్రభుత్వం ఆలోచన చేయాలని అన్నారు. ఇప్పటివరకు మా స్వశక్తితో ఉద్యమం నడుస్తున్న ప్రతిపక్షాలు నడిపిస్తున్నారంటూ రాజకీయ కుట్ర జరుగుతుందన్నారు. చెప్పి తప్పించుకోవడం ముఖ్యమంత్రి హోదాకు తగదన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమముగా మార్చి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు, సంతోష్ రెడ్డి, రాములు, వనజ,రమేష్, శ్రీవాణి,శైలజా,కాళిదాసు, వీణ,చిరంజీవి, కృష్ణ, శ్రీనివాస్,మాధవి,సంధ్యా,దినేష్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now