*నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలి
డాక్టర్ తులసీదాస్*
*జమ్మికుంట/ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 6*
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో డాక్టర్ తులసీదాస్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని దాని వలన దోమల వృద్ధి చెంది విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని వేడి చేసి చల్లార్చిన నీళ్లను తాగాలని స్వచ్ఛమైన ఆహార పదార్థాలను తీసుకోవాలని మురికి నీరు నీలో ఉన్నచోట ఆయిల్ బాల్స్ ను వేయాలని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని తెలిపారు అనంతరం గ్రామంలోని గర్భిణీ ఇండ్లకు వెళ్లి వారితో మాట్లాడుతూ నార్మల్ డెలివరీ అయ్యే విధంగా చూసుకోవాలని ఏఎన్ఎంలు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని తెలిపారు