సభలో కాదు…ప్రజల్లోనే ఉండాలి..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సభలో కాదు…ప్రజల్లోనే ఉండాలి

ఈ రోజు వరకు మాత్రమే అసెంబ్లీ హాజరు

రేపటి నుండి ప్రజల మధ్యకే వెళ్ళనున్నానని స్పష్టం

వరదల సమయంలో సభ కంటే ప్రజలు ముఖ్యమని వ్యాఖ్య

ప్రజల సమస్యల పరిష్కారమే తన అసలైన లక్ష్యం

స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వర్షాలు, వరదలతో రాష్ట్రం కష్టాల్లో ఉండగా ప్రజల పక్కనే నిలవాలని నిర్ణయించుకున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.

“ఈ రోజు సభ ప్రారంభం కాబట్టి వచ్చాను. రేపటి నుండి నేను అసెంబ్లీకి రాను. ప్రజల్లో ఉండి వారి కష్టాలు తీర్చడమే నా లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సభలో కూర్చోవడం కంటే, నేరుగా ప్రజలతో ఉండి వారి సమస్యలు పరిష్కరించడం తానే చేయబోయే పని అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment