సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి శాంతినగర్‌లో కొనసాగుతున్న వికాస్ ఓకేషనల్ జూనియర్ కళాశాలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి (డీఐఈఓ) గోవిందారామ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన బృందంతో కలిసి కళాశాలను పరిశీలించి, నోటీసులు అతికించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ కళాశాలలో అడ్మిషన్ చేయవద్దని తెలిపారు. వికాస్ ఓకేషనల్ జూనియర్ కళాశాల బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి గుర్తింపు పొందలేదని, ఎలాంటి అఫిలియేషన్ లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నదని అన్నారు. అనుమతి లేని కళాశాలలో చేరిన విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఒక వేళ ఎవరు అయినా ఈ కళాశాలలో అడ్మిషన్ చేసుకుంటే, దాని పట్ల బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేదా డీఐఈఓ కార్యాలయం ఎలాంటి బాధ్యత వహించదని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు జాగ్రత్తగా గుర్తింపు పొందిన కళాశాలల్లోనే ప్రవేశాలు తీసుకోవాలని గోవిందారామ్ సూచించారు.
అనుమతులు లేని వికాస్ ఓకేషనల్ జూనియర్ కళాశాలకు నోటీసులు: ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి గోవిందారామ్
Published On: October 30, 2025 2:15 pm