కామారెడ్డిలో డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

కామారెడ్డిలో డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఖాళీలకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 17 

కామారెడ్డి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షకురాలు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు.జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్, గైనకాలజిస్ట్, అనస్థీషియా మరియు GDMO పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె వివరించారు.బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (గైనకాలజీ), అనస్థీషియా పోస్టులు, ఎల్లారెడ్డి ఆసుపత్రిలో ఇద్దరు గైనకాలజిస్టులు, అనస్థీషియా స్పెషలిస్టు, అలాగే మద్నూర్ ఆసుపత్రిలో GDMO పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.ఈ నెల 20వ తేదీ వరకు ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు కామారెడ్డి DCHS కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని డాక్టర్ విజయలక్ష్మి సూచించారు.

Join WhatsApp

Join Now