బిబిపేట మండలానికి ఎన్ ఆర్ జి ఎస్, ఎస్ డి ఎఫ్  నిధులు మంజూరు

బిబిపేట మండలానికి ఎన్ ఆర్ జి ఎస్, ఎస్ డి ఎఫ్

నిధులు మంజూరు చేసిన ప్రభుత్వ సలహాదారు

– కృతజ్ఞతలు తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుతారి రమేష్

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

బిబిపేట మండలానికి ఎన్ ఆర్ జి ఎస్, ఎస్ డి ఎఫ్

నిధులు మంజూరు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కి బీబీపట మండల ప్రజల తరఫున మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుతారి రమేష్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ సహకారంతో బిబిపేట్ మండల గ్రామాలలో ఎన్ ఆర్ జి ఎస్, ఎస్ డి ఎఫ్ నిధులతో సిసి రోడ్లు మంజూరు చేయడం జరిగినదన్నారు.( ఎన్ ఆర్ జి ఎస్ ) లో బిబిపేట్ గ్రామపంచాయతీ భవనానికి 20 లక్షలు, సిసి రోడ్ 10 లక్షలు, మల్కాపూర్ సిసి రోడ్ 10 లక్షలు, తుజాల్పూర్ సీసీ రోడ్ 10 లక్షలు, ఉప్పర్ పల్లి సిసి రోడ్ 10 లక్షలు, జనగామ సిసి రోడ్ 10 లక్షలు, మాందాపూర్ సిసి రోడ్ 5 లక్షలు, (సీడీఎఫ్ )లో డ్రైనేజ్ ,మల్కాపూర్ 5 లక్షలు, తుజాల్పూర్ 5 లక్షలు, ఉప్పర్ పల్లి 5 లక్షలు, జనగామ 10 లక్షలు. గ్రామాల అభివృద్ధిపై నిధులు మంజూరు చేయడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కమిటీ తరఫున షబ్బీర్ అలీ కి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.

Join WhatsApp

Join Now