మానసిక వికలాంగుల ఆశ్రమానికి 85 వేల విలువగల సామాగ్రి అందజేసిన ఎన్నారై కండె రాకేష్ దీపిక

మానసిక వికలాంగుల ఆశ్రమానికి 85 వేల విలువగల సామాగ్రి అందజేసిన ఎన్నారై కండె రాకేష్ దీపిక

జమ్మికుంట ఆగస్టు 29 ప్రశ్న ఆయుధం

మానసిక వికలాంగుల ఆశ్రమానికి జమ్మికుంట పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు, జమ్మికుంట ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు, రామ సాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ బచ్చు శివకుమార్ ప్రేమలత దంపతుల కుమార్తె అమెరికాలో నివాసం ఉంటున్న కండే రాకేష్ దీపిక జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగ పిల్లలందరికీ ఒక పూట భోజనం,ఏర్పాటు చేసి పళ్ళు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి అమెరికాలో ఉంటున్న కండె రాకేష్, దీపిక 30000 రూపాయల విలువ గల ఫ్రిడ్జ్ 50 వేల రూపాయల విలువగల జనరేటర్ ను రెండు సీలింగ్ ఫ్యాన్ లను ఆశ్రమ వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చి రాములు కి అందజేశారు ఈ సందర్భంగా బచ్చు శివ కుమార్ మాట్లాడుతూ కండే దీపిక జన్మదినాన్ని పురస్కరించుకొని 85 వేల రూపాయల విలువ గల వస్తువులను ఆశ్రమానికి వితరణ చేయడం జరిగిందని, మున్ముందు కూడా ఆశ్రమ అభివృద్ధిలో పాలు పంచుకొని ఆశ్రమ అభివృద్ధికి పాటుపడతానని చాలామంది దాతలు సహకరిస్తే,ఎంతో మంది మానసిక దివ్యాంగుల పిల్లల జీవితాల్లో వెలుగులు నిండుతుందని పేర్కొన్నారు ఆశ్రమ పాఠశాలకు సహాయ సహకారాలు అందించడం ఎంతో అభినందనీయమని కొండ్ల నగేష్ అన్నారు సహకరించిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇలాంటి సహకారం అందించిన బచ్చు శివకుమార్ ఫ్యామిలీకి కండె రాకేష్ దీపిక కుటుంబ సభ్యులందరికీ పేరెంట్స్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఆశ్రమ వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చి రాములు తెలిపారు

ఈ కార్యక్రమంలో కొండ్ల నగేష్ వ్యాపారి సమ్మయ్య పాఠశాల సిబ్బంది,పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment