ఎల్ ఆర్ ఎస్ వేగవంతం చేయాలి..
-అంగన్ వాడి కేంద్రం పరిశీలన
కామారెడ్డి జిల్లా దోమకొండ
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 15:
ఎల్ ఆర్ ఎస్ క్షేత్ర స్థాయి దృవీకరణను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి ఎం.జ్యోతి సూచించారు. మంగళ వారం దోమకొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఎల్ ఆర్ ఎస్ టీమ్ తో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడ్లారు. అదే విధంగా దోమకొండ మండల కేంద్రంలోనీ అంగన్వాడి సెంటర్ ను పరిశీలించారు. పిల్లలకు గర్భిణీ బాలింత మహిళలకు పౌష్టిక ఆహారం సరఫరాలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. పిల్లలు సెంటర్ కు వచ్చే విధంగా చూడాలని సూచించారు . ఇట్టి కార్యక్రమంలో ప్రత్యేకాధికారి ఎం. జ్యోతి , ఎంపిడివో ప్రవీణ్ కుమార్ ఎల్ ఆర్ ఎస్ టీమ్ పాల్గొన్నారు.