Headlines :
-
దీపావళి పండుగను కారుణ్య ఆశ్రమంలో ఘనంగా జరిపిన ఎన్.ఎస్.యు.ఐ
-
కారుణ్య ఆశ్రమ విద్యార్థులకు దీపావళి టపాసుల పంపిణీ
-
భద్రాచలం ఎన్.ఎస్.యు.ఐ టీమ్ నుండి కారుణ్య ఆశ్రమానికి దీపావళి శుభాకాంక్షలు
దీపావళి పర్వదినాన్ని సంతరించుకొని భద్రాచల పట్టణానికి ఆనుకొని ఉన్న శ్రీరాంనగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి *కారుణ్య ఆశ్రమ విద్యార్థులకు, ఆశ్రమ నిర్వాహకులకు* దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి, దీపావళి టపాసులను ఎన్.ఎస్.యు.ఐ నియోజకవర్గ *సరెళ్ళ వెంకటేష్* అందజేయడం జరిగింది.
*ఈ సందర్భంగా ఎన్.ఎస్.యు.ఐ నాయకులు మాట్లాడుతూ….*
పిల్లల కేరింతలు,ఆనందోత్సహల నడుమ జరుపుకునే ఈ దీపావళి పండుగ, కారుణ్య ఆశ్రమంలోని పిల్లలు కూడా ఆనందంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వారికి దీపావళి టపాసులు అందజేయడం జరిగిందని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో….
నియోజకవర్గ రాహుల్ గాంధీ (ఆర్.జి) సోషల్ మీడియా అధ్యక్షులు కొత్త శ్రీనివాస్, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు భూక్య నరసింహ,ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.