తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలార్ ను కలసిన ఎన్ ఎస్ యూ ఐ నాయకులు..!

తెలంగాణ
Headlines :
  1. తెలంగాణ యూనివర్శిటీ కొత్త వైస్ ఛాన్సలర్ ను కలిసిన ఎన్.యస్.యూ.ఐ నాయకులు
  2. యూనివర్శిటీ సమస్యలపై చర్చించిన ఎన్.యస్.యూ.ఐ
  3. నూతన వైస్ ఛాన్సలర్ కి శుభాకాంక్షలు తెలిపారు
  4. విద్యార్థుల వసతి, ఇంజనీరింగ్ కళాశాలపై ఆసక్తికరమైన చర్చ

 నూతన వి.సి కి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు సాగర్ నాయక్.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 విశ్వవిద్యాలయాలకు నూతనంగా ఉప కులపతులను నియమించిన విషయం విదితమే. ఇందులో భాగంగానే తెలంగాణ విశ్వవిద్యాలయానికి నూతనంగా నియమితులైన వైస్ ఛాన్సలర్ ఆచార్య టీ.యాదగిరి రావును యన్.యస్.యూ.ఐ వర్శిటీ అధ్యక్షుడు బానోత్ సాగర్ నాయక్ నేతృత్వంలో నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యూనివర్శిటీ లో నెలకొనియున్న పలు సమస్యలను గురించి వీసికి వివరించారు. అటు ప్రధాన సమస్యలైనా నూతన బాలికల వసతి గృహం, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు తో పాటు తదితర సమస్యలను వీసికి దృష్టికి తీసుకెళ్లారు. యూనివర్సిటీని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు. ఈ మేరకు వీసి సానుకూలంగా స్పందించారని సాగర్ నాయక్ పేర్కొన్నారు .

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఉపాధ్యక్షులు భూక్యా హరీష్ ,మహేష్ ప్రధాన కార్యదర్శులు జనార్ధన్ నవీన్ ,శ్రీకాంత్, శివప్రసాద్ ,లక్ష్మణ్ , యుగేందర్ ,శివ ,విజయ్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now