*డిసెంబర్ 14న ఎన్టీఆర్ సినీ వజోత్సవం*
ఏపీలో డిసెంబరు 14న విజయవాడ లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవము జరగనుంది. ఎన్టీఆర్ లిటరేచర్, వెబ్సైట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం
చంద్రబాబు, విశిష్టఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారని వెల్లడించారు.
ఈ కార్యక్రమాన్ని ముందుగా నవంబరు 24వ తేదీన నిర్వహించాలనుకున్నా అనివార్య కారణాలతో వాయిదా వేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.