*సావిత్రిబాయి పూలే జయంతి మహిళ ఉపాధ్యాయ దినోత్సవం*
*రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించిన ఎన్ టి ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్*
*జమ్మికుంట జనవరి 3 ప్రశ్న ఆయుధం*
శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఎన్ టి ఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ యాదవ్ ఘనంగా నిర్వహించారు అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నిమ్నజాతి కులాల నుండి ఒక గొప్ప సంఘ కర్తగా అప్పటి పాలకులను ఎదిరించి దేశానికే వన్నె తెచ్చే విధంగా దేశంలోని తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా చరిత్రలో నిలిచినటువంటి ఆ మహనీయురాలి చరిత్రను గుర్తించి రేపటి భవిష్యత్తులో మహిళలకు మార్గదర్శకంగా తన పోరాట పటిమను చూపే గొప్ప యోదురాలనీ అలాంటి మహోన్నతమైన చరిత కలిగిన మహనీరాలి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్ టి ఎస్ ఎఫ్ పక్షాన రాష్ట్ర మహిళా సోదరీమణులకు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ టి ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ యాదవ్ విద్యార్థులు మౌనిక శిరీష స్వప్న శ్వేత అనిత శృతి అనూష తదితరులు పాల్గొన్నారు