వంశపారంపర్యంగానే మాకు భూములోచ్చాయి…….
●బిజిలిపూర్ మహమ్మద్ ఆఫ్జల్ వివరణ..
●ఆరోపణలు చేస్తున్న వారెవరో కూడ మాకు తెలువదు..
●మావద్ద అన్నిరకాల డాక్యుమెంట్లు, ఆధారాలు ఉన్నాయని వెల్లడి..
●మాపై వస్తున్న ఆరోపణలన్ని కూడ అవాస్తవమే..
●షేక్ చాంద్, షేక్ జహంగీర్..
ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 23(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని బిజిలిపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఆఫ్జల్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆఫ్జల్ తెలిపిన వివరాల ప్రకారం మాతండ్రి హుస్సేన్ పేరిట గ్రామ సమీపంలో సర్వేనెంబర్ 88/2లో 1-14 గుంటల భూమి ఉండగా అందులో వ్యవసాయం చేసుకుంటున్నామన్నారు. గత 2014లో మాతండ్రి హుస్సేన్ మరణించగా పౌతి మార్పుతో రికార్డులలో నాపేరిట భూమి ఆన్ లైన్ లోకి వచ్చేసిందన్నారు. నాకుటుంబ అవసరాల నిమిత్తం గత 2 సంవత్సరాల క్రితం బోయిన్ పల్లికి చెందిన డాక్టర్ సద్ది మాధవరెడ్డికి అమ్మినమన్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి బిజిలిపూర్ లో 88/2 సర్వేనెంబర్ లో ఉన్న భూమి మాదని వస్తున్నవారెవరో మాకు తెలువదని, వాళ్లతో మాకుటుంబానికి ఎలాంటి సంబంధమే లేదని ఆఫ్జల్ ఆరోపించారు. భూమికి సంబందించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఆధారాలు అన్ని మావద్ద ఉన్నాయని ఆయన అన్నారు.