స్వతంత్ర దినోత్సవ జండా కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు మురళీధర్ గౌడ్

ప్రశ్నాయుధం న్యూస్, ఆగస్టు 15, కామారెడ్డి :

  • స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఈశ్వర్ పురాలోని జండా కార్యక్రమంలో బిజెపి నాయకులు మురళీధర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు.
    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మనం జరుపుకుంటున్న స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అందుకోసం పోరాడిన వారిని స్మరించుకుందామని, ఇది పండుగ మాత్రమే కాదని దీని వెనకాల అనేక త్యాగాలు, విషాదాలన్నాయని అన్నారు.
    స్వతంత్రం కోసం జరిగిన ఉద్యమాలలో ఎక్కువ కాలం పోరాటం చేసిన చరిత్ర భారతదేశంలో మొగలుల దగ్గర నుంచి బ్రిటిష్ వారి వరకు వందల సంవత్సరాలు మనకు స్వతంత్రం కావాలనే భారతీయులు పోరాటం చేశారని, వేలాది మంది ప్రాణాలు భారతమాత దాస్యశృంఖలాల నుండి విముక్తి కోసం ప్రాణ త్యాగం చేశారని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రపంచంలో ఎక్కువ క్వాలిటీ గల మానవ సంపద ఉన్న ప్రదేశం భారతదేశమని, మోడీ ఎక్కడ వెళ్లిన నా దేశం నా యువ సంపద ఉన్న దేశం ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఆకలి కేకలులేని, ఆత్మహత్యలు లేని సమాజం కావాలని, సంపద విద్యార్థుల చేతుల్లో ఉందని మీరు దేశ సంపదని మీ ఎదుగుదలలోనే దేశం కనిపిస్తోందన్నారు. ఎల్లవేళలా మీతో పాటు నేను నాతో పాటు మీరు సమాజ సేవ కోసం 24 × 7 అందరికీ అందుబాటులో ఉంటానని బిజెపి నాయకులు మురళీధర్ గౌడ్ అన్నారు. ఈ జండా కార్యక్రమంలో చింతల రమేష్, బిజెపి నాయకులు పెంట నర్సింలు, మురుగన్, వంశీ, రాజేష్ ,లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now