Site icon PRASHNA AYUDHAM

ఇండియన్ ప్రైడ్ అవార్డు…

IMG 20240819 WA0509

ఇండియన్ ఫ్రైడ్ అవార్డు పొందిన డా.ముప్పారం ప్రకాశం

భారతదేశంలో అన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే తూచా తప్పకుండా రాజ్యాంగం అమలు చేయాలి.

హైదరాబాద్ ఆగస్టు 19 ప్రశ్న ఆయుధం :

వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో 78వ స్వాతంత్రోత్సవంలో భాగం నిర్వహించిన ఇండియన్ ఫ్రైడ్ అవార్డుల పురస్కారం కార్యక్రమంలో సాహసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.ముప్పారం ప్రకాశం కు మాజీ భారత సైనిక అధికారి మేజర్ జనరల్ శ్రీనివాస్ రావు  చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా డా.ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ 78 వ స్వాతంత్రోత్సవాలు జరుపుకుంటున్న మన దేశంలో నేటికీ పేదా మధ్యతరగతి ప్రజలు జీవితాల్లో మార్పు రాలేదని, భారత్ ప్రపంచంలో అన్ని దేశాలకంటే ముందుండాలటే మన పాలకులు మారాల్సి వుందన్నారు. అన్ని సమస్యలకూ పరిష్కారం దేశ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయించడం ఒక్కటే మార్గం అని ప్రజాస్వామ్యవాదులు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వే ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ పైడి అంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version