● సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి
ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 21 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
శివ్వంపేట మండలం లోని శభాషపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సుగుణ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ లో గుర్తింపు పొందిన యూనియన్ తో చర్చలు జరిపకుండ కార్మికులను అక్రమ ట్రాన్స్ఫర్ ల పేర్లతో యజమాన్యం తీవ్ర ఇబ్బందుల గురిచేస్తుందని వెంటనే కార్మికులను ఇబ్బందిగా చేస్తున్న సుగుణ యాజమాన్యంపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి గారు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.వెంటనే ట్రాన్స్ఫర్ చేసిన కార్మికులని వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే నిరవధిక సమ్మె లోకి వెళ్తామని ఆయన అన్నారు. ట్రాన్సఫర్స్ చేసిన కార్మికులను విధులకు తీసుకోవాలని ఈ రోజు మెరుపు సమ్మె లోకి వెళ్లడం జరిగిందని ఆయన అన్నారు.యాజమాన్యం మొండి వైఖరి విడనాడి కార్మికులను విధులోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి జె. యాదగిరి, కోశాధికారి వై కుమార్, ఇంద్రేశ్, రమాకాంత్, భాస్కర్,యాదగిరి, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు