ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు వెంటనే మానుకోవాలి..!

ఎస్సీ వర్గీకరణ ప్రయాత్నాలు వెంటనే మానుకోవాలి

రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ డిమాండ్ 

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ నేతృత్వం లో చేపట్టిన 1000 కిలోమీటర్ల మాలల మహా పాదయాత్ర అక్టోబర్ 25 న భద్రాచలంలో ప్రారంభమై మంగళవారం ఉదయం 11 గంటలకు ఖమ్మం పట్టణం ఖానాపురం ఆవేలీలో అడుగుడినందున యూనిటీ ఆఫ్ మాల , జాతీయ మాల మహానాడు ఖమ్మం జిల్లా కమిటి ల ఆధ్వర్యంలో డబ్బు శబ్దాలు కోలాటాల నడుమ పిల్లి సుధాకర్ కు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి జాతీయ మాల మహానాడు జిల్లా నాయకులు యూనిటీ ఆఫ్ మాల ముఖ్య నాయకులు కార్యకర్తలు సంయుక్తం గా మహా పాదయాత్రగా జిల్లా పరిషత్ సెంటర్ వరకు చేరుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పిల్లి సుధాకర్ మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణకు అనుకూలమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమంటూ 341 ఆర్టికల్ సవరించనిదే వర్గీకరణ చెల్ల నేరదని 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తానని అనటం అన్యాయం అని అన్నారు. వాస్తవ పరిస్థితులు ఏంటో తెలియకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలమంటూ శాసనసభ సాక్షిగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన మాలలకు అన్యాయం చేయట మేనని స్పష్టం చేశారు. వర్గీకరణ ప్రయత్నాలు వెంటనే విరమించుకోక పొతే మాలల ఉగ్రతకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గురి కావడం తప్పదని తీవ్రం గా హెచ్చరించారు. మాలలందరు ఐక్యం గా ఉద్య మించక పోతే ఈ జాతి తీవ్రం గా నష్ట పోవడం ఖాయం అని ఇకనైనా కలసి కట్టు గా పోరాడి ఈ ప్రభుత్వాలకు మాలల సత్తా ఏంటో నిరూపించాలని పిలుపు నిచ్చారు. డిసెంబర్ 01 న మాలల మహా పాదయాత్ర ముగింపు సందర్భం గా హైద్రాబాద్ పట్టణం లోని రవీంద్ర భారతి నందు జరుగు మాలల మహా సంగ్రామం నకు పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా నుండి తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనిటి ఆఫ్ మాల జిల్లా అధ్యక్షులు కందుల ఉపేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అవుట మధు, వర్కింగ్ ప్రెసిడెంట్ జాగటి మధు జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఉండేటి శ్రీను, స్టీరింగ్ కమిటీ పెద్దలు బి. జి క్లెమెంట్, చిలక బత్తిని కనకయ్య , గులగట్టు ఎల్లయ్య , జాతీయ మాల మహానాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు బందేల నాగ లక్ష్మీ, కామ ప్రభాకర్, శ్రీరాములు, చింతల రవి, అప్పం సురేష్ , మద్దెల రవి, బుడిపుటి రాము, కొప్పుల రామకృష్ణ, గుర్రం మనోజ్, చింతల వినయ్, కామల్ల కనకరత్నం, నీరుడు రాంబాబు, జానయ్య తది తరులు పాల్గోన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment