వెనుకబడిన ఎస్సీ కులాలను ఆదుకోవాలి..!

వెనుకబడిన ఎస్సీ కులాలను
ప్రభుత్వం ఆదుకోవాలని తాసిల్దార్ కు వినతి
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి పినపాక మండలం కమిటీ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం జరిగింది. పినపాక సెంటర్ నుండి ర్యాలీలు మండల తాసిల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హయాంలో2016లో నూతన రెవెన్యూ చట్టం తీసుకురావడం వల్ల ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు మ్యానువల్ పాణి పంట రుణాలు పొందే అవకాశం కోల్పోయినారు. 2019 లో నూతన పంచాయతీ రాజ్ చట్టం తీసుకురావడం వలన ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలను జనరల్ లో కలపడం వలన జడ్పిటిసిలు, ఎంపీటీసీలు లేకుండా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క లు స్పందించి ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలు కోల్పోయిన స్థానిక రిజర్వేషన్ తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల తరతరాల సాగు భూములకు, పోడు భూములకు కాంక్షలు లేకుండా హక్కు పత్రాలు ఇవ్వాలని, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మనుడు మంజూరు చేయాలని, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితులకు అంబేద్కర్ అభయహసం రూ,, 12 లక్షలు పథకం నిరుద్యోగులకు, నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ ఎనగంటి కృపాకర్, కండే రాములు, ఇనుముల వెంకటేశ్వర్లు, నరాల రాజేష్, సోంపల్లి తిరుపతి, జిమ్మిడి సుమన్, వల్లే పాక నాగేశ్వరరావు, జాడి రాంబాబు, గద్దల వెంకటేశ్వర్లు, జిమ్మిడి శివశంకర్, గోమాస్ గోవర్ధన్, జాడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now