పిల్లల ఆరోగ్యానికి పౌష్టికాహారం పునాది 

పిల్లల ఆరోగ్యానికి పౌష్టికాహారం పునాది

గర్గుల్ MPPS ప్రీ ప్రైమరీ పాఠశాలలో న్యూట్రిషియస్ ఫుడ్ ఫెస్టివల్

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 20:

ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారా మెరుగైన ఆరోగ్యంతో పాటు మేధాశక్తి కూడా పెరుగుతుందని జిల్లా ఎంఈఓ ఎల్లయ్య తెలిపారు. కామారెడ్డి పరిధిలోని గర్గుల్ గ్రామ ఫ్రీ ప్రైమరీ (MPPS) పాఠశాలలో శనివారం నిర్వహించిన PTM – న్యూట్రిషియస్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేసి , వాటి ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. సమతుల్య ఆహారం వల్ల పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి మెరుగుపడుతుందని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని ఫుడ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేశారు. పిల్లల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ప్రతి నెలా 3 వ శనివారం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు,ఈ క్రమంలో ఎంతో ఉపయోగపడతాయని ఉపాద్యాయులు పిల్లలకు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment