*అంగన్వాడీలో పోషణ పక్షం వేడుకలు*
*జమ్మికుంట ఏప్రిల్ 22 ప్రశ్న ఆయుధం*
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి అంగన్వాడీలో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా పోషణ లోపం తగ్గించేందుకు తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా మిల్లెట్స్ ఫుడ్, చిరుధాన్యాలు, మనకు అందుబాటులో దొరికే ఆకుకూరలు, పండ్లు, పాలు అంగన్వాడిలో ఇచ్చే బాలామృతం ,బాలామృతం ప్లేస్ తీసుకోవడం వలన బాలింతలకు పోషణ అందుతుందని బాలింతలు గర్భిణీలు పౌష్టిక ఆహారం తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ అధికారులు, కొత్తపల్లి అంగన్వాడీ టీచర్ పి కవిత, డి సుమతి ,వీ సరోజన, టి రమాదేవి ,కే రేణుక తదితరులు పాల్గొన్నారు.