Site icon PRASHNA AYUDHAM

పోషణ మాసంలో భాగంగా పోషణ ప్రతిజ్ఞ

IMG 20240911 WA0431

మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రమైన చండీ సబ్ సెంటర్ లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ అభియాన్ పోషణ మాసోత్సవంలో భాగంగా బుధవారం ఐసిడిఎస్ మండల సూపర్వైజర్ సంతోష ఆధ్వర్యంలో గ్రామీణ పోషణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పౌష్టికాహారం, ఆరోగ్యం పై మహిళలకు అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేస్తుందని తెలిపారు. అనంతరం మహిళల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ విజయలక్ష్మి అంగన్వాడి పద్మ .రేనా ఏఎన్ఎం స్వప్న ఆశలు వీరామని మంజుల గ్రామ మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Exit mobile version