ఓ విశ్వవసు నామ సంవత్సరమా విజయాలు చేకూర్చుమా

తూముల శ్రీనివాస్

ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి30

కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

శ్రీక్రోధినామసంవత్సరంనకు

వీడ్కోలుచెబుతూ

శ్రీవిశ్వవసునామసంవత్సరమునకు

స్వాగతాలు పలుకుతూ

గడచిన గతం వద్దు

వర్తమానమే ముద్దు

అవ్వాలిపకృతి

విలయతాండవవిపత్తులు రద్దు

 

మానవులుఆశాజీవులు

వారిజీవితాలలో

వెలగాలి జ్యోతలు

ప్రతి కుటుంబంలో

నిండుగా ఉండాలి

సుఖశాంతులు

 

తగవులు లేని

కాపురాలు

తల్లిదండ్రులకు

మనశ్శాంతిలు

పిల్లలకు సాగాలి

చదువు సంధ్యలు

పొందాలి ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు

 

అభివృద్ధి చెందాలి అట్టడుగు వర్గాలు

వెతకాలి అందుకు మార్గాలు

చదువుతూనే ఉండాలి పుస్తకాలు

పొందుతూనే ఉండాలి డిగ్రీ పట్టాలు

 

తెలుగు బిడ్డలుగ సాధించాలి ఘనవిజయాలు

అదే తెలుగు ఉగాది సంవత్సరానికి మనవిచ్చే నిజమైనశశుభాకంక్షలు

రచన;- తూముల శ్రీనివాస్

కొత్తగూడెం, 9397025027

Join WhatsApp

Join Now