నిఘా నేత్రమా నీ చూపు ఎటు వైపు..
అధికారుల కళ్ళకు ప్రజల భద్రత కనిపించడం లేదా! ప్రజల జీవితం అంటే అంత నిర్లక్ష్యంమా! -స్థానిక ప్రజలు
రాజంపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్న సీసీ కెమెరా ఎటువైపు చూస్తుందో పోలీస్ అధికారులకి తెలియాలి.మారుతున్న సమాజంలో సీసీ కెమెరా కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యాపార,ఇంటి ముందు,వీధి కూడళ్లలో కాపలాదారునిగా వ్యవహరిస్తోంది.అన్ని సమయాల్లో నిఘా నేత్రంగా పనిచేస్తున్న సీసీ కెమెరా ను ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేశారో దృశ్యం చూస్తే తెలుస్తోంది. నిఘా నేత్రంగా, ప్రతి కేసులో కీలకమైన పాత్ర వ్యవహారిస్తున్న సీసీ కెమెరా ను బిగించడం లో అధికారుల నిర్లక్ష్యం కోట్టచినట్లు కనిపిస్తుంది, దొంగలకు దారి చూపించినట్లుగా బిగించడం చాలా దుర్మార్గమైన చర్యగా చెప్పవచ్చు. అలాగే ఇలాంటి చర్యల వల్ల ప్రజలు భద్రత కోల్పొవడం జరుగుతుంది..
నిఘా నేత్రాలుగా…..ప్రతి గ్రామంలో గాని,పట్టణంలో గాని,ప్రతి విధి లో గాని సీసీ కెమెరా అనేది నిఘా నేత్రాలుగా పనిచేస్తూ ప్రజల భద్రత ను కల్పిస్తున్నాయి.కాబట్టి ప్రతి కార్యాలయంలో కూడా సీసీ కెమెరా భద్రత దృశ్య ఏర్పాటు చేస్తారు.అలాగే ప్రజల భద్రత కల్పించడంలో సీసీ కెమెరా ముఖ్య పాత్ర పోసిస్తున్నాయి. ఇంత ముఖ్య పాత్ర పోషిస్తున్న సీసీ కెమెరా ను బిగించడం లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై అధికారుల తీరు మనకు అర్థం అవుతుంది.ప్రజల భద్రత ను పట్టిచుకోకుండా ఇష్ట రితిగా బిగించడం పై అధికారులు స్పందించి సమాధానం చెప్పాలి అని స్థానికులు డిమాండ్ చేశారు..భద్రత,బాధ్యత గాలికి వదిలేసిన అధికారులు..సీసీ కెమెరాలు బిగించడం తూతూ మంత్రంగా బిగించి వారి పని భారం తగ్గించుకుంటున్నారు.కానీ చాలా ఉపయోగకరమైన వస్తువు అని ముఖ్యంగా భద్రతా దృశ్య ఏర్పాటు చేస్తారు అనే సోయిమర్చి బిగించడంలో వారి సోమరితనం కనబడుతోంది.ఇంత నిర్లక్ష్యమా..అధికారుల కళ్ళకు ప్రజల భద్రత కనిపించడం లేదా! ప్రజల జీవితం అంటే అంత నిర్లక్ష్యంమా! ప్రజలకు భద్రత కల్పించకపోక ఉన్న సీసీ కెమెరా ల నిర్వహణ కూడా గాలికి వదిలేయడం చాలా బాధాకరమైన విషయం గా చెప్పవచ్చు….ఇప్పటికైనా సీసీ కెమెరా ల నిర్వహణ, సీసీ కెమెరాలు బిగించడం సరి చేయాలి అని స్థానిక ప్రజలు అధికారులను హెచ్చరించారు…..