శాబ్దీపూర్ వరి కొనుగోలు కేంద్రంలో పరిశీలన — ప్యాడి క్లీనర్ వినియోగంతో రైతులకు నష్టం

శాబ్దీపూర్ వరి కొనుగోలు కేంద్రంలో పరిశీలన

— ప్యాడి క్లీనర్ వినియోగంతో రైతులకు నష్టం

తగ్గింపు: 

కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి,జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 18

శాబ్దీపూర్‌ గ్రామంలోని ఐకెపి మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ప్యాడి క్లీనర్‌ ద్వారా ధాన్యం శుద్ధి చేయడం వల్ల రైతులకు క్వింటాలుకు 1.5 కిలోల వరకు ఆదా అవుతోందని అభినందించారు. ఇప్పటివరకు 76 మంది రైతుల నుండి 3,142 క్వింటాళ్లు కొనుగోలు చేసి 13 లారీల్లో మిల్లులకు పంపినట్లు అధికారులు తెలిపారు. పారదర్శకంగా తూకం నిర్వహణ, MSP ₹2,389 చెల్లింపులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కేంద్రాన్ని ఇతరులకు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Join WhatsApp

Join Now