నిజాంసాగర్ జీఎచ్‌ఎస్‌లో కాంప్లెక్స్ సమావేశం పరిశీలన
సైన్స్ ల్యాబ్ అభివృద్ధి – మిడ్‌లైన్ పరీక్ష పేపర్లను తప్పనిసరిగా సంరక్షించాలని MEO సూచనలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 27
నిజాంసాగర్: ప్రభుత్వ హైస్కూల్ (GHS) నిజాంసాగర్‌లో నిర్వహించిన బయోసైన్స్ కాంప్లెక్స్ సమావేశాన్ని MEO శ్రీ తిరుపతి రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల సైన్స్ ల్యాబ్‌ను పరిశీలించి, మిడ్‌లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ పేపర్లను తప్పక సంరక్షించాలని, తద్వారా విద్యార్థుల అభ్యాసాన్ని విశ్లేషించి పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించవచ్చని సూచించారు.
కాంప్లెక్స్ సమావేశంలో HM శ్రీ వెంకటేశం, RP మహేష్, RP గంగాధర్, STUTS KMR జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పంపరి ప్రవీణ్ కుమార్, TRTF KMR జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రాజేశ్వర్, బయోసైన్స్ ఉపాధ్యాయినితో పాటు పలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.