*వృత్తి ఫోటోగ్రఫీ.. ప్రవృత్తి ధ్యానం… హాబి నాణేల సేకరణ*
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 27:ఆయన వృత్తి ఫోటోగ్రఫీ
తీయడం గత 40 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీలో ఉంటూ తన పని తాను చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఒక లక్ష్యంతో ఆయన నాణాల సేకరణ మరియు అందరూ ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో ధ్యానం క్లాసులను నిర్వహిస్తూ అందరి మన్ననల పొందుతున్న బాల్కొండ మండల కేంద్రానికి చెందిన సింధుల రాజేందర్ ఆయన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి బాల్కొండ మండలంలోని ఇత్వార్ పేట్ గ్రామంలో జన్మించి ఫోటోగ్రఫీలో మెళుకువలు నేర్చుకొని బాల్కొండలో ఫోటో స్టూడియో ను పెట్టి అంచలంచలుగా ఎదుగుతూ ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ వారికి జీవనోపాధిని చూపించారు. అంతేకాకుండా ఫోటోగ్రఫీలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అవగతం చేసుకొని వాటికి అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసుకొని తన వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ బాల్కొండ పరిసర ప్రాంతాల ప్రజలకు సేవలందిస్తున్నారు .
*అభిరుచి గా నాణేల సేకరణ:*
తన వృత్తి ఫోటోగ్రఫీతో పాటు తనకున్న హాబీ నాణేల సేకరణ ఎంచుకొని స్వాతంత్రం ఏర్పడిన తర్వాత వచ్చిన నాణేలన్నిటిని కూడా సేకరించి దాచారు. నాణేలను సేకరించడం తన హాబీగా మల్చుకొని దాదాపు కొన్ని వందల సంఖ్యలో నాణాలను సేకరించారు.
*ఆరోగ్యం కోసం ధ్యానం క్లాసుల నిర్వహణ*
ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్లే అని బాల్కొండ పరిసర ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతిరోజు బాల్కొండ మండల కేంద్రంలో ధ్యానం క్లాసులను నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఎక్కడైనా సమావేశాలు నిర్వహించిన సభలు నిర్వహించిన అక్కడికి వచ్చిన ప్రజలందరికి ధ్యానం ప్రత్యేకతను తెలియజేయడం వారిచేత ధ్యానం చేయించడం దీంతో వేలాది మందికి ఆదర్శంగా నిలిచిన రాజేందర్ కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.