అక్టోబర్ 2న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం..
వినీలాకాశంలో మరో అద్భుత ఖగోళఘట్టం చోటుచేసుకో బోతోంది. అక్టోబర్ 2న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.13 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమం అవుతుంది. ఆ సమయంలో మన దేశంలో రాత్రి కావడంతో గ్రహణం కనిపించదని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చిలీ, దక్షిణ అర్జెంటీనాలోని కొన్ని ప్రాంతాలలో గ్రహణం కనిపిస్తుందని పేర్కొన్నారు.