ఆక్టోపస్, పోలీసు”దళాలు మాక్ ఆపరేషన్..
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నందు అర్ధ రాత్రి నుంచి వేకువజాము వరకూ కొనసాగింది.విపత్కర సమయంలో ఆక్టోపస్, పోలీసు దళాలు సన్నద్ధతను.. వివిధ శాఖల సమన్వయాన్ని తెలియజేస్తూ సాగిన మాక్ ఆపరేషన్ నిర్వాహణ.జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మాక్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహణ. మరియు పోలీస్ దళాలు శనివారం వేకువజామున రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం లో మాక్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ అర్ధరాత్రి ప్రారంభమై ఉదయం వరకు కొనసాగింది.
ఆక్టోపస్ దళాలు మాక్ ఆపరేషన్ విమానాశ్రయం నందు అనుకొని విధముగా ఎదైనా తీవ్రమైన ఘటనలు లేదా ఉగ్రమూకలు దాడికి పాల్పడితే సిబ్బంది, ప్రయాణికులు, సందర్శకులు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియ జేసేందుకు ఆక్టోపస్ దళాలు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు, ఫైర్ సర్వీసు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు కలసి సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు.
అకస్మాత్తుగా ఉగ్రమూకలు విమానాశ్రయం నందు చొరబడి దాడికి పాల్పడితే వారిని ఏ విధంగా ఎదుర్కోవాలో క్షతగాత్రులు, బందీల ప్రాణాలు ఏ విధంగా రక్షించాలి.. ప్రభుత్వ ఆస్తులను ఏ విధంగా కాపాడాలో అవగాహణ కల్పించడానికి ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.
ప్రతి ఒక్కరు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అనుమానితులు తారసపడితే తక్షణమే స్థానిక పోలీసులకు లేదా విమానాశ్రయ అధికారులకు
సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీనివాసరావు రేణిగుంట, కృష్ణ ఆక్టోపస్, సిఐలు గాజులమండ్యం, ఆక్టోపస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.