Site icon PRASHNA AYUDHAM

అధికారులు పక్షపాత వైఖరి..!!

IMG 20250824 WA0101

అధికారులు పక్షపాత వైఖరి

కరీంనగర్ నగరంలో వావిలాల పల్లి హనుమాన్ ఆలయం వద్ద అనేక దశాబ్దాలుగా స్థిర నివాసం ఏర్పరచుకొని నివసిస్తున్న రమాదేవి వయసు 80 సంవత్సరాలు వారి భూమిని ఆక్రమించే క్రమంలో నిబంధనలకు వ్యతిరేకంగా ఎస్వీ రెసిడెన్సి ఎదురుగా వావిలాలపల్లిలో పేలుళ్లు జరపగా పేలుళ్లకు కారకులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని తమకు ప్రాణ హాని ఉన్నందనీ తమ ఇంటిని రక్షించాలని కోరుతూ అనేక ఫిర్యాదులు చేసిన నేటికి ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోలేదు. పోలీసులు, రెవెన్యూ, మునిసిపల్, అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులు అనేకసార్లు పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఎస్వీ రెసిడెన్సి యొక్క సి సి ఫుటేజ్ సేకరించి నిర్ధారణకు వచ్చి అనేక ఆధారాలను సాక్షాలను అధికారులు రికార్డులు చేసినప్పటికీని దానికి కారకులైన ఒంటెల సుమ, సత్యనారాయణ రెడ్డి మరియు వారి అనుచరులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు తెలుపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్డిఓ కే మహేశ్వర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలను సాక్షాలు సేకరించి శ్వేత పత్రం విడుదల చేయకపోవడానికి అధికారుల పక్షపాత వైఖరి తెలుస్తుంది. పక్షపాత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. అనంతరం కూడా రమాదేవి ఇంటిపై అనేకసార్లు అక్రమ నిర్మాణాలు చేస్తూ కూల్చితూ ఇంటి హద్దులను చెరిపి వేస్తూ నానా విధాలుగా ఇబ్బందులకు దౌర్యనానికి అరాచకాలకు సుమ సత్యనారాయణ రెడ్డి వారి అనుచరులు పాల్పడుతూనే ఉన్నారు. వీటన్నింటి పై ఎప్పటికప్పుడు స్థానిక పోలీసు అధికారుల నుండి రాష్ట్ర గవర్నర్ వరకు అనేక ఫిర్యాదులు చేసినప్పటికీని నేటికి ఎలాంటి చర్య తీసుకోకపోగా ఫిర్యాదుదారులకు సాక్షులకు వేధింపులు అధికమైనాయి. ప్రజావాణిలో సైతం అనేక ఫిర్యాదులు చేయడం జరిగింది. గత సంవత్సరం రమాదేవి ఇంటిపై ఒంటెల సుమ, ఒంటెల సత్యనారాయణ రెడ్డి , పోలీసులు, మహిళలు మరియు వారి అనుచరులు మాకుమ్మడిగా దాడి చేసి ఇంట్లో బీభత్యాన్ని సృష్టించి ఇంటి ఆవరణంలో ఉన్న చెట్లను కొట్టేస్తూ బెదిరిస్తూ మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచి ఇంటి ఆవరణంలో బీభత్సాన్ని సృష్టించి ఇంట్లోనే విలువైన వస్తువులను,పత్రాలను తీసుకెళ్లినారు. అదే రోజు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా రాత్రి ఫిర్యాదులు స్వీకరించి ఆధారాలు స్వీకరించారు. మరుసటి రోజు సీఐ జాన్ రెడ్డి ఏసీపీ నరేందర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలను సాక్షాలను రికార్డు చేసిన నేటికీ ఎలాంటి కేసులు చేయకపోగా రాజి కుదుర్చుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ఆ కుటుంబ పై జరిగిన దాడిని ప్రజలు ప్రజాసంఘాలు నిజ నిర్ధారణకు వచ్చినటువంటి అనేక సంఘాలు బహిరంగంగా అధికారులను ప్రశ్నించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అధికారులు అందరి పక్షపాత వైఖరి తెలుస్తుంది. తద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చారో అధికారులు ప్రజల్ని గమనిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు బాధితులకు న్యాయం చేయాలని వాస్తవాల్ని ప్రజలకు ముందు ఉంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు

Exit mobile version