అధికారులు ప్రత్యేక చర్యలు..

 హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షాల సమయంలో వేగంగా స్పందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిపై అన్ని శాఖల అధికారులతో నగర సీపీ సీవీ ఆనంద్‌ సమీక్షించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, మూడు కమిషనరేట్ల సీపీలు, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్‌, హెచ్‌ఎండీఏ, హైడ్రా అధికారులు పాల్గొన్నారు. భారీ వర్షాల సమయంలో పలు ప్రధాన కూడళ్లలో వరదనీరు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించి ట్రాఫిక్ మళ్లింపులు చేయడం, నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే చర్యలు చేపట్టడం వంటి అంశాలపై చర్చించారు.

ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు, ట్రాఫిక్ జామ్ అప్‌డేట్‌ వివరాలను అందించాలని సీపీ అధికారులకు సూచించారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై దీర్ఘకాలిక ఫలితాలిచ్చే చర్యలు చేపట్టాలన్నారు. ట్రై-పోలీస్ కమిషనరేట్లు, జీహెచ్‌ఎంసీ ఇతర విభాగాల ట్రాఫిక్ కమిషనర్లతో కూడిన ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఐటీ కంపెనీలతో అనుసంధానం, ప్రధాన నీటి వనరుల్లో నీటి మట్టాలను పర్యవేక్షించడం, సాంకేతికతను పెంచడం వంటి అంశాలపై అధికారులు చర్చించారు.

Join WhatsApp

Join Now