హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు

*హైదరాబాద్‌లో నాలుగు చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు, చెన్నై నుంచి వచ్చి తనిఖీలు చేస్తున్న అధికారులు*

హైదరాబాదులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఆకస్మిక సోదాలు చేపట్టింది. రెండు సంస్థలపై ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తున్నారు. ఎస్బీఐ నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో సురానా ఇండస్ట్రీస్ తో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈడీ సోదాలు చేపట్టింది. జూబ్లీహిల్స్ మాదాపూర్ బోయినపల్లి, సికింద్రాబాద్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నారు. సురానా గ్రూపు చైర్మన్, ఎండీ నివాసాలలో ఈడి అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి.

సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్, ఎండి నివాసాలలో సోదాలు చేపట్టారు. మొత్తం నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు.

చెన్నై చెందిన ఈడీ బృందాలు హైదరాబాద్‌లో బుధవారం ఉదయం ఆకస్మిక దాడులు ప్రారంభించాయి. సూరానా గ్రూప్ చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంది. అయితే తీసుకున్న రుణాలను బ్యాంకులకు తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు సురానాపై అభియోగాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ విషయంపై సురానా గ్రూప్ పై సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. సురానా గ్రూపునకు అనుబంధంగా పనిచేస్తున్న సాయి సూర్య డెవలపర్స్ ప్రాపర్టీస్, యజమానుల నివాసాలపై ఈడీ దాడులు చేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment