సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఇంద్రేశంలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. శనివారం గ్రామ పంచాయతీ సెక్రటరీ సుభాష్ ఆధ్వర్యంలో ఇంద్రేశంలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న వాటిని కూల్చి వేస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ సుభాష్ మాట్లాడుతూ.. ఇంద్రేశంలో ఎక్కడైనా అనుమతులకు మించి నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీరి వెంట కారోబార్ సాయికుమార్, సిబ్బంది ఉన్నారు
ఇంద్రేశంలో అక్రమ కట్టడాలు కూల్చివేసిన అధికారులు

Oplus_0