గుండూరు లో నీటి కష్టాలు పట్టించుకోని అధికారులు

గుండూరు లో నీటి కష్టాలు

పట్టించుకోని అధికారులు

ప్రశ్న ఆయుధం 14 మార్చి (జుక్కల్ ప్రతినిధి )

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మారుమూల ప్రాంతమైన గుండూర్ గ్రామంలో గత వారం రోజుల నుండి నీళ్లు రాకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.ఈరోజు హోళీ పండుగ కావడంతో నీళ్లు లేక ఎక్కడి నుండి నీళ్లు తెచ్చుకోవాలో అర్థం కావడం లేదంటూ ఇబ్బంది పడుతున్నారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు,అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నీటి కష్టాలు తొలగించి నీళ్లు వచ్చే విధంగా పరిష్కరించాలని కోరుతున్నారు.

గ్రామ పంచాయతీ సెక్రటరీ వివరణ :ఈ విషయమై ఫోన్ ద్వారా పంచాయతీ సెక్రటరీ కి వివరణ కోరగా మిషన్ భగీరథ వాటర్ రావడం లేదని సింగిల్ ఫేస్ బోర్ రిపేర్ లో ఉందని పొంతన లేని సమాధానం చెప్పడం గమనార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment