ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికారులు..

ఇసుక లారీలతో పెను ప్రమాదం. 

మొన్న భద్రాచలంలో.. ఈరోజు చర్ల లో…

ప్రాణాలు పోతున్న పట్టించుకోని అధికారులు..

నిద్రపోతున్న, టిఎస్ఎండిసి, మైనింగ్, రవాణా శాఖ అధికారులు. 

రోడ్డుపై వాహనాల పార్కింగ్.. ప్రయాణికులకు ఇక్కట్లు…

ఇసుక మాఫియా పుణ్యమా అని అత్యధిక ఓవర్ లోడ్లతో ఇసుక లారీలు రాకెట్ వేగంతో దూసుకు వెళ్తుండడం, ప్రజల ప్రాణాలు తీస్తుండడం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. మైనింగ్, టిఎస్ఎండిసి, రవాణా శాఖ ఇతర పర్యవేక్షించాల్సిన శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై ప్రయాణించే వారు ప్రాణాలు కోల్పోతున్నారు. రేగుబల్లి, చర్ల ఇసుక ర్యాంపు వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, రహదారులు పూర్తిగా ధ్వంసం అవడం వలన అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అధికారులు స్పందించి తక్షణమే అధిక లోడ్లతో వెళుతున్న లారీలపై కేసులు నమోదు చేసి, లారీలలో కెపాసిటీకి మించి ఇసుక వేస్తున్న ర్యాంపు లను సీజ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now