సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, సంగారెడ్డి పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి, చిత్రపటానికి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పూలమాలలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, వివిధ సంఘాలు, సమాజ సేవా సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొని అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించారు.
డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
Published On: April 14, 2025 12:33 pm
