సదరు ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ యాదవుల దీర్ఘకాలిక కళను నెరవేర్చింది

సదరు
Headlines :
  1. సదరు ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ యాదవుల కళను నెరవేర్చింది
  2. టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం వ్యాఖ్యలు
  3. యాదవుల ఐక్యతను ప్రోత్సహించేందుకు సదర్ ఉత్సవాల ప్రాధాన్యం
  4. ప్రతి సంవత్సరం నిర్వహించే సదర్ ఉత్సవాల పండుగలో భాగం
  5. కూకట్ పల్లి నియోజకవర్గంలో ఉత్సవం ఘనంగా సాగింది

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సదర్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ యాదవుల దీర్ఘకాలిక కళను నెరవేర్చింది – సత్యం శ్రీరంగం.”

ప్రశ్న ఆయుధం నవంబర్ 02: కూకట్‌పల్లి ప్రతినిధి

” యాదవుల ఐక్యత, పాడిపంటలు, పశు సంపదను ప్రతి బింబిస్తూ ప్రతీ ఏటా నిర్వహించేవి సదర్ ఉత్సవాలు – టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం.”

కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ లో కొరమ్స్ సదర్ సయ్యటా ఆధ్వర్యంలో మరియు మూసాపేట్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ సదర్ అనేది యాదవుల ఖాదర్ అని, అందుకే ప్రతీ దీపావళి సందర్బంగా ఏర్పాటు చేసుకునే సదర్ ఉత్సవాల సమ్మేళనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడం హర్షణీయమని అన్నారు. యాదవుల ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు దశాబ్దాలుగా సదర్ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. యాదవుల ఐక్యత, పాడిపంటలు, పశు సంపదను ప్రతి బింబిస్తూ ప్రతీ ఏటా యాదవులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించే సదర్ పండుగ ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఆ కృష్ణుని ఆశీస్సులతో యాదవ సోదరులు అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, బాలాజీనగర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్ పుత్, పులి శ్రీకాంత్ పటేల్, ఐలయ్య యాదవ్, ఎల్లేష్ యాదవ్, అనిల్ యాదవ్, శేఖర్ గజానంద్, వెంకటేష్ యాదవ్, కర్క పెంటయ్య, ఐఎన్ టియుసి నాయకులు నరసింహయాదవ్, మల్లేష్ యాదవ్, గణేష్ యాదవ్, వేంకటేష్ మరియు పెద్ద ఎత్తున యాదవ సోదరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now