నాగారంలో అక్రమ నిర్మాణాలకు అండగా అధికారులు? స్థానికుల ఆగ్రహం

*నాగారంలో అక్రమ నిర్మాణాలకు అండగా అధికారులు? స్థానికుల ఆగ్రహం*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూలై 22

నాగారం మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక నిర్మాణదారుడు G+1 (గ్రౌండ్ ప్లస్ వన్) అంతస్తులకు మాత్రమే అనుమతులు పొంది, అదనంగా మరో అంతస్తును నిర్మిస్తున్నప్పటికీ, మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ అక్రమ నిర్మాణం ప్రారంభ దశలోనే ఉన్నప్పుడు ఫిర్యాదు చేసినా, అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఈ నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ జీతాలతో సరిపెట్టుకోకుండా, ఇలాంటి అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ అదనంగా డబ్బులు దండుకుంటున్నారని టౌన్ ప్లానింగ్ అధికారులపై స్థానికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడుతున్నప్పటికీ, అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై మున్సిపల్ కమిషనర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment