తప్పిదాలు జరిగితే అధికారులదే బాధ్యత

*ఇందిరమ్మ ఇండ్లలో అర్హులను ఎంపిక చెయ్యాలి*

*తప్పిదాలు జరిగితే అధికారులదే బాధ్యత*

*మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు*

*ఇల్లందకుంట జనవరి 15 ప్రశ్న ఆయుధం*

IMG 20250115 WA0049

పథకాలను ప్రతి అర్హునికి అందేలాగా చూడవలసిన బాధ్యత అధికారులదే ఉంటుందని అనర్హులను ఎంపిక చేస్తే అధికారులు బాధ్యత వహించవలసి ఉంటుందని

మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈనెల 26 నుండి అమలుపరచనున్న ప్రభుత్వ పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు లకు సంబందించి అర్హుల ఎంపికపై తహసీల్దార్ రాణి, ఎంపీడీఓ పుల్లయ్య తో కలిసి మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు బుధవారం 15 నుంచి 20 తారీకు వరకు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో సర్వే చేసేందుకు ఆయా శాఖ అధికారుల తో కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.20 వ తేది నుంచి 10 రెవిన్యూ గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనీ ప్రత్యేకధికారి శ్రీనివాసరావు సమావేశం లో వివరించారు.ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయ అధికారి ముప్పిడి సూర్యనారాయణ, ఎంపీవో రాజేశ్వర్రావు డిప్యూటీ తాసిల్దార్ పార్థసారథి ఆర్ ఐ నాగరాజు, ఏపీఓ రవి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now