పెట్రోల్ బంకులను తనిఖీలు చేయడం మరిచిన అధికారులు

*పెట్రోల్ బంకులను తనిఖీలు చేయడం మరిచిన అధికారులు*

– సివిల్ సప్లై అధికారులు కనిపించరు…

– తూనికల కొలతల అధికారుల జాడేది?*

*బంకుల్లో కనిపించని డెన్సీటీ మీటర్లు*

జిల్లాలో పలు పెట్రోల్ బంకులను అధికారులు తనిఖీ చేయకపోవడంతో పెట్రోల్ బంకుల యజమానులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వినియోగదారులకు అందించవలసిన సౌకర్యాలను అందించడం లేదు. పెట్రోల్ యొక్క నాణ్యత తెలిపే డెన్సీటీ మీటర్లు అసలే పనిచేయడం లేదు. నాణ్యతలేని పెట్రోల్ డీజిల్ వల్ల వాహనాలు త్వరగా చెడిపోయే అవకాశం ఉంది .గత కొన్ని నెలలుగా సివిల్ సప్లై అధికారులు కానీ తునికలువకొలతల అధికారులు కానీ పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. వారికి ఎవరైనా ఖచ్చితమైన సమాచారం ఇస్తేనే అక్కడికి వెళ్లి చూడడం తప్ప వారి విధి నిర్వహణలో భాగంగా మాత్రం ఎక్కడా కూడా తమ విధులను నిర్వహించడం లేదు. దీంతో పలు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కు బదులు డీజిల్ లను పోయడం సోషల్ మీడియాలో మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన పెట్రోల్ లో నీళ్లు రావడం జరుగుతుంది. నీళ్లు కలిసిన ఇంధనం వలన వాహనాలను త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ అధికారులకు మాత్రం చలనం లేదు.కామారెడ్డి జిల్లాలో పలు పెట్రోల్ బంకుల్లో అవగాహన లేని వారిని పెట్రోల్ పోయడానికి ఉద్యోగులు గానీయమించడంతో వారికి ఏ పనిలో ఏం పోయాలో తెలియక తికమకపడుతూ పలు సందర్భాలలో పెట్రోల్ వాహనాల్లో డీజిల్ పోయడం మామూలుగా మారిపోయింది . గత కొద్ది రోజుల క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ లో బైక్ లో పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్లగా అందులో డీజిల్ పోసిన సంఘటన వెలుగు చూసింది. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా అధికారుల స్పందించి అడపాదడపా పెట్రోల్ బంకులను తనిఖీ చేయాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.

తాగునీరు, ఎయిర్ మిషన్ లేని బంకులెన్నో…

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో కొన్ని బంకుల్లో తాగునీరు సౌకర్యం, వాహనాలలో గాలి నింపేందుకు గాలిని నియింపేవ్ మిషన్లు లేని బంకులు ఉన్నాయి. ఆ మిషన్ లు ఉన్న నామమాత్రం గానే ఉన్న అవి పని చేయడం లేదని పలువురు వాహనదారులు పేర్కొంటున్నారు. అవి చూడడానికి మాత్రమే ఉన్నాయని గాలి మాత్రం ఏ వాహనానికి పెట్టడం లేదని పలువురు వాహనదారులు వాపోతున్నారు. పెట్రోల్ ధర చెల్లింపులో మాత్రం అన్ని సేవలు కలుపుకొని ఉంటాయి. కానీ ఏ సేవలు అందించకుండానే అన్ని రకాల డబ్బులను బంక్ యజమానులు వినియోగదారుల నుండి దోచుకుంటున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సివిల్ సప్లయ్ అధికారులు మరియు తూనికలు కొలతల అధికారులు తనిఖీలు చేపట్టి వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now